Monday, January 20, 2025

నేను బిఆర్‌ఎస్ చైర్మన్‌ను కాదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం శా సన మండలిలో చీఫ్‌విప్‌గా పట్నం మ హేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహేందర్‌రెడ్డిని బీఆర్‌ఎస్ విప్‌గా చూ డా లా? కాంగ్రెస్  విప్‌గా చూడాలా అని మీడియా అడగ్గా మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్‌గా చూడాలని సుఖేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. తాను బీఆర్‌ఎస్ మండలి చైర్మన్ కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల మీద బీఆర్‌ఎస్ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదని, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఆర్థిక వనరులు ఉన్నా, లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారన్నారు. నాయకులు వాడుతున్న భాష సరిగా లేదని, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా, ఇంకేమైనా వాడుకున్నా పద్దతిగా ఉండాలని, ఒక పని ప్రభుత్వం చేస్తుందంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దని అన్నారు. మూసీ ప్రక్షాళన కూడా అంతే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి. ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది. అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు. దీనికి అందరూ భాధ్యులేనని పేర్కొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన పట్నం మహేందర్ రెడ్డి : రాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్‌గా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సెక్రటరీ నరసింహచార్యులు సమక్షంలో బుధవారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవగా ఆయన మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ ,ఈర్లపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, బల్మూరి వెంకట్, ఎగ్గే మల్లేష్, భాను ప్రకాష్, ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన నాయకులు వజ్రేష్ యాదవ్ , చరణ్ కౌశిక్ యాదవ్ , పరమేశ్వర్ రెడ్డి రామ్మోహన్ గౌడ్, రోహిన్ రెడ్డి కొలను హనుమంత్ రెడ్డి, భీమ్ భరత్, పట్నం రినీష్ రెడ్డి, తదితరులు మహేందర్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం : డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
మండలి చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మండలిలో సీనియర్ సభ్యుడిగా సభ్యులందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందరితో కలిసి చట్టసభల ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తరపున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉండడం సంతోషం. వారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని, అందరికి అందుబాటులో ఉంటామని చెప్పారు.

సహాయ సహకారాలు అందిస్తాం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రాష్ట్ర చట్టసభల్లో సుదీర్ఘ అనుభవమున్న మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ రావడం సంతోషకరమని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సీనియర్ సభ్యులుగా మహేందర్ రెడ్డి మండలి లో శాసన తయారీ ప్రక్రియ, చర్చ లాంటి అంశాల్లో తోటి సభ్యులకు చేదోడువాదుడుగా ఉంటారని, మహేందర్ రెడ్డి తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News