Wednesday, January 22, 2025

92లో తప్పిపోయి, మృతురాలయి… ఇప్పుడు బతికి ఉన్న వారి జాబితాలో

- Advertisement -
- Advertisement -

పిట్స్‌బర్గ్ : 30 ఏండ్ల క్రితం కనబడకుండా పోయ్యి, కాలక్రమంలో చనిపోయినట్లుగా అధికారులు నిర్థారించిన ఓ మహిళ ఇప్పుడు అమెరికాలోని ప్యూర్టో రికోలో సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. పాట్రికా కోప్టా 52వ ఏట ఉన్నట్లుండి ఆమె అప్పట్లో నివసిస్తున్న పిట్స్‌బర్గ్‌లో కనబడకుండా పోయింది. 1992 నుంచి ఆమె జాడలేకుండా పోయిందని ఆమె భర్త బాబ్ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా చాలాకాలం వెతికారు. చివరకు చనిపోయినట్లుగా నిర్థారించారు. అయితే ఇప్పుడు 83వ సంవత్సరంలో ఉన్న పాట్రికా ఫ్యూరెటోరికోలో ఓ నర్సింగ్‌హోంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు తీవ్రస్థాయిలో మతిమరుపు రావడం, తనను తాను మర్చిపోవడం వంటి పరిణామాల నడుమ ఆమె తన బాధ ఏమిటనేది, పూర్తిస్థాయిలో చెప్పలేని స్థితిలో తనముందుకు వచ్చిన ఓ సామాజిక కార్యకర్తకు తెలిపింది. దీనితో ఇంతకాలం ఆమె ఎక్కడి వారు? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది అంతుచిక్కకుండానే మిగిలింది. అయితే పోలీసులు తమ ముందుకు వచ్చిన మిస్సింగ్ కేసుల విచారణ, క్లోజ్ చేసిన ఫైళ్ల పునః పరిశీలన దశల్లో ఆమె గురించి తెలుసుకుని తెలియచేశారు.

తనకు ఇది దిగ్భ్రాంతికరమైన విషయం అయిందని నమ్మలేకుండా ఉన్నానని సోదరి గ్లోరియా స్మిత్ తెలిపారు. ఆమె ఎప్పుడో చనిపోయిందని ఇంతకాలం తాము భావిస్తూ వచ్చామని, సజీవంగా ఉన్నట్లు తెలియడం తమకు సంభ్రమాశ్చర్యాలను ఆనందాన్ని మిగిల్చిందని వివరించారు. 1999లో ఆమె తానెవ్వరో తెలియని మానసిక స్థితిలో కేర్‌హోంకు చేరింది. తాను యూరప్ నుంచి ఓ నౌకలో వచ్చినట్లు అక్కడి వారికి చెప్పిందని స్థానిక పోలీసు అధికారి బ్రెయిన్ కొహిహెప్ సిబిఎస్ పిట్స్‌బర్గ్ వార్తా సంస్థకు తెలిపారు. ఆమె వీధుల్లో తిరుగుతూ ఉండగా అధికారులు సంరక్షణా కేంద్రానికి తరలించారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె చెప్పలేకపోయిందని వివరించారు. అయితే ఓ సామాజిక కార్యకర్త ఇటువంటి దిక్కులేని వారి పరిస్థితి గురించి అధ్యయనం చేస్తూ ఉన్న దశలో ఆమెను ఆదరించి సన్నిహితంగా ఉండటంతో చివరికి తన గతం గురించి చెప్పగలిగింది. దీనితో తొమ్మిది నెలల పాటు ఇంటర్‌పోల్ ద్వారా జరిపిన దర్యాప్తు క్రమంలో చివరికి డిఎన్‌ఎ శాంపుల్స్ పరీక్షల తరువాత ఆమె ఎవరనేది వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News