Wednesday, January 22, 2025

సిమ్లా విపక్ష భేటీలో పిడిఎ అవతరణ?

- Advertisement -
- Advertisement -

బిజెపి వ్యతిరేక విపక్ష కూటమికి సర్వంసిద్ధం
స్వరూపంపై స్పష్టత లేదు కానీ ఖరారే
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎతో ఈ వేదికతో ఢీ?
న్యూఢిల్లీ : త్వరలోనే దేశ రాజకీయ రంగంలోకి పేట్రియాటిక్ డెమొక్రాటిక్ అలయెన్స్ (పిడిఎ) ఉనికిలోకి రానుంది. బిజెపియేతర ప్రతిపక్షాల కూటమిగా సాధ్యమైనంత త్వరలోనే ఈ పలు ప్రతిపక్ష పార్టీలతో కూడిన సరికొత్త రాజకీయ వేదిక రానుందని వెల్లడైంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందే విపక్షాల మధ్య నిర్థిష్టతతో కూడిన ఐక్యత సాధనదిశలో ఈ నెల 23వ తేదీనే పాట్నాలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి తదుపరి దశలో వచ్చే నెల 10 12 మధ్యలో సిమ్లాలో తిరిగి విపక్షాల భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా పిడిఎ సంబంధిత స్వరూపానికి తుది మెరుగులు దిద్దుతారని విపక్ష నేతల ద్వారా వెల్లడైంది. విరామం లేకుండా విపక్ష ఐక్యత దిశలో పలుమార్లు సమావేశాలకు సంకల్పించారు.

ఎడమెఖం పెడమొఖంగా ఉన్న విపక్షాలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు వచ్చే ఎన్నికలలో బిజెపిని సంఘటితంగా ఎదుర్కొనేందుకు నిర్ణయించారు. ఈ దశలో దేశభక్తియుత ప్రజాస్వామ్య కూటమి చట్రం వెలుగులోకి రానుందనివెల్లడైంది. పాట్నాలో జరిగిన విపక్ష సదస్సులో 15 పార్టీలకు చెందిన 32 మంది ప్రముఖ నేతలు ఒకచోట చేరారు. ఇంతకు ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో యుపిఎ అధికారంలోకి వచ్చింది. దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఈ కూటమిలో కలిసి పనిచేశాయి. ఇప్పుడు అధికారంలో బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ చలామణి సాగుతోంది. ఈ క్రమంలో ఇకపై వెలిసే పిడిఎ ఏ విధంగా ఎన్‌డిఎకు సవాలు విసురుతుందనేది తేలాల్సి ఉంటుంది. శుక్రవారం జరిగిన పాట్నా ప్రతిపక్షాల సదస్సు గురించి సిపిఐ సీనియర్ నేత , పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు.

పాట్నాలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలోనే సిమ్లాలో జరిగే మలిదఫా విపక్ష సదస్సులో పిడిఎకు పూర్తి స్వరూపం ఏర్పడుతుందని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటికైతే పూర్తి స్పష్టత రాలేదని, తుది నిర్ణయం తీసుకుంటామని రాజా వివరించారు. అంతా కలిసి పనిచేయడం ఫక్కా అయిందని, అయితే విధివిధానాల రూపకల్పన సిమ్లా భేటీలో జరుగుతుందని స్పష్టం చేశారు. రాబోయేది పిడిఎ అని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో బిజెపిని అధికారంలోకి రాకుండా చేయడంపై తమకు పూర్తి స్పష్టత ఉందని, ప్రతిపక్షాలన్ని దీనిపై సరైన విధంగా అవగావహనకు వచ్చాయని తెలిపారు. ఐక్యత సాధన సంపూర్ణం అయినట్లే, అయితే దీని సాకారం త్వరలో ఉంటుందన్నారు.
సిఎంపి, సీట్ల సర్దుబాట్లు కీలకం
ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) ముఖ్యం. ఈ క్రమంలో వివిధ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అత్యంత కీలకం. సిమ్లా సమావేశంలో ఈ విషయంపై చర్చలు జరుగుతాయని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఇప్పుడు రూపొందే పిడిఎలో భావసారూప్య పార్టీల కలయిక ఉంటుంది. లౌకిక, ప్రజాస్వామిక సిద్ధాంతాలే కీలకం అవుతాయి. వీటికి అనుగుణంగానే కొత్త కూటమి పేరు రూపం ఉంటుందని సిపిఐ నేత రాజా తెలిపారు. తమిళనాడులో ఇప్పుడు లౌకిక ప్రజాస్వామిక కూటమి ( ఎస్‌డిఎఫ్) ఉంది. బీహార్‌లో మహాఘట్‌బంధన్‌గా విపక్షాలు కలిశాయి. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో వెలిసే పిడిఎలో ఉమ్మడి ప్రతిపక్షాల సంబంధిత విలువలు, కట్టుబాట్లు ఉంటాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News