- Advertisement -
మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో గుర్రం అరుణ కుమారి అనే మహిళపై తన మరిది కొడుకు సాయికుమార్ ఆస్తి గొడవల కారణంగా పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితురాలు అరుణ ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులకు తెలిపారు. ఉదయం అంగన్వాడి సెంటర్ కు వెళ్ళటంతో అక్కడకు వచ్చిన సాయి మీ భర్త వల్ల నా పొలం నాశనమైంది అంటూ కేకలు వేస్తూ కవర్ సంచుల్లో తెచ్చిన పెట్రోల్ నాపై పోసి నిప్పు అంటించాడని బాధితురాలు తమ ఆవేదనను పోలీసులకు విన్నవించింది. బాధిత మహిళ గ్రామంలో అంగన్వాడి-1 సెంటర్ లో టీచర్ గా పని చేస్తుంది. మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకెున్న పోలీసులు విచారణ చేపట్టారు.
- Advertisement -