Thursday, January 23, 2025

పోడు రైతులకు ‘పట్టా’భిషేకం

- Advertisement -
- Advertisement -
  • దశాబ్దం తరువాత పోడు పట్టాల పంపిణీ
  • జూన్ 24 నుంచి పట్టాల పంపిణీకి ఏర్పాట్లు
  • రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి జిల్లాలోనే పంపిణీ
  • తొలి విడతగా గిరిజన రైతులకే పట్టాలు
  • హాజరుకానున్న ముఖ్యమంత్రి కెసిఆర్?
  • పోడు పట్టాదారులందరికీ కూడా ‘రైతు బంధు’ వర్తింపు

దాదాపు రెండు దశాబ్దాల తరువాత పోడు రైతులకు పట్టాలు అందబోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత అటవి విస్తీర్ణం కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని దశాబ్దాల నుంచి గిరిజనులు పోడు కోట్టుకోని వ్యవసాయం చేసుకుంటూపోట్ట పోసుకుంటున్న విషయం తెలిసిందే. వారందరికీ వచ్చె నెల 24 నుంచి పట్టాల పంపిణీ జరగనుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. 2005 డిసెంబర్ 13కు ముందు నాటి పోడు సాగుదారులందరికీ పట్టాలు అందనున్నాయి. తొలి విడతగా కేవలం గిరిజన రైతులకే పట్టాలను పంపిణీ చేయనున్నారు.

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సి ప్రాంతాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గొత్తికోయలు, ఇతర గిరిజనులు పలు గ్రామాల్లో గుడిసెలు వేసుకొని అటవిప్రాంతాల్లో పోడుకొట్టి అట్టి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటవీ హక్కుల చట్టం- –2005 ప్రకారం గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఆ సమయంలో దరఖాస్తు చేసుకున్న చాలా మందికి పట్టాలు రాకపోగా ఆ తరువాత కూడా వందలాది మంది మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. అంతేగాక మళ్ళీ కొత్తగా పోడు వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారు.

దీనిని నిరోధించేందుకు అటవి శాఖ అధికారులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక గ్రామాల్లో పోడు రైతులకు, అటవీ అధికారుల మద్య ఘర్షణ వాతవరణం ఏర్పడింది. అనేక మంది గిరిజనులపై అటవి అధికారులు కేసులు నమోదు చేసి జైల్‌కు పంపించారు. కొంత మంది పిడియాక్ట్ టాటా కేసులను నమోదు చేశారు. చిన్నపిల్లలను సైతం అరెస్ట్ చేసిజైల్‌కు పంపించారు. చాలా చోట్ల అటవి అధికారులపై గిరిజనులు తిరుగుబాటు చేశారు. భద్రాద్రి జిల్లాలో ఒక అటవి అధికారి గిరిజనుల చేతిలో బలయ్యారు. పలు సంఘటనలో అనేక మంది గాయపడారు.

ఖరీఫ్ సిజన్ ప్రారంభమైందంటే ప్రతి ఏటా జూన్‌లో ఉమ్మడి జిల్లాలో పోడు సమస్య తలెత్తేది. 2018 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పోడురైతులకు పట్టాలను పంపిణీ చేస్తామని వాగ్ధానం చేశారు. ఆతరువాత పలు సందర్భాల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సందర్భంగా కూడా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 2021లో పోడు పట్టాల కోసం అర్హులైన వారినుంచి దరఖాస్తులను స్వీకరించింది. సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 3,42,462 ఎకరాల కోసం 1,01,828 దరఖాస్తులు అందాయి. గత ఏడాది ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సర్వే నెంబర్ల ఆధారంగా సర్వే నిర్వహించారు.

గ్రామాల వారికి ప్రత్యేక సాంకేతిక సహాయంతో క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. ఈ సర్వేలో వాస్తంగా పోడు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను, గిరిజనేతరులను, ఇతరులను గుర్తించారు. బోగస్ రైతుల దరఖాస్తులను ప్రక్కన పెట్టారు. గ్రామ సభలను నిర్వహించి అర్హులను తేల్చారు. మండల, డివిజన్, జిల్లా కమిటీల పరిశీలన తరువాత ఖరారైన పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో దరఖాస్తులు తీరస్కరణకు గురైన వారు అభ్యంతరం పెట్టగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయా దరఖాస్తులను పునఃపరిశీలన చేశారు.

ఈ సందర్బంగా తెలిన అర్హులతో మళ్ళీ కొత్త జాబితాను తయారు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగిసిన తరువాత జూన్ 24 నుంచి 30 వరకు పట్టాలను పంపిణి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల నిర్ణయించారు. రాష్ట్రంలో అత్యధికంగా పోడు పట్టాల పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే జరగనుంది. ఈ జిల్లాలో 50595 మంది లబ్ధిదారులకు 1,51,195 ఎకరాలను పంపిణీ చేయబోతున్నారు. ఈ జిల్లాలో 299478 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు రాగా సర్వే అనంతరం వాటిలో సగానికి సగం అనర్హులుగా తేల్చారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 5857 మంది లబ్దిదారులకు 9779 ఎకరాలను పంపిణి చేయనున్నారు.

ఈ జిల్లాలో పోడు భూముల అవాసాలు 132 ఉండగా 94 గ్రామ పంచాయతీలో సర్వే జరిగింది. ఈ జిల్లాలో మొత్తం 43193 ఎకరాల కోసం మొత్తం 18487 దరఖాస్తులు వచ్చాయి. అయితే తొలి విడతగా కేవలం గిరిజనులకే పట్టాలను పంపిణీ చేస్తున్నందునా 9779 ఎకరాలకు సంబంధించి 5857 మంది లబ్ధిదారులే పట్టాలను అందుకుంటారు. తొలి విడతగా కేవలం గిరిజన రైతులకు మాత్రమే పట్టాలను అందజేయాలని నిర్ణయించారు. గిరిజనేతరులు, దళితులు, ఇతరులకు మలి దఫా పంపిణీ చేస్తారని అధికారుల అంటున్నారు. గ్రామాలవారిగా లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా పోడు పట్టాలు ఉన్నందున వాటిని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా కొత్తగూడానికు హాజరయ్యే అవకాశం ఉంది.

  • పోడు పట్టాదారులందరికి ‘రైతు బంధు’

కొత్తగా పోడు పట్టాలను అందుకున్న గిరిజన రైతులకు కూడా వానాకాలం రైతు బంధు అందేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పట్టాలను జారీచేసే రైతుతల పేరుమీద ప్రభుత్వమే బ్యాంక్ ఖాతాలను తెరిచి నేరుగా వారి ఖాతాలోనే రైతు బంధు సాయాన్ని జమ చేయనున్నారు రెండు కాలాలకు సంబంధించి ఎకరానికి రూ.10వేల చొప్పున వారి ఖాతాలో జమ కానున్నాయి. దాదాపు రూ.161 కోట్ల నిధులు పోడు రైతులకు అందనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News