Monday, December 23, 2024

ఐదేళ్లలో జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి: పట్టాభి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఐదేళ్లలో సిఎం జగన్ మోహన్ రెడ్డి రూ.8 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని టిడిపి నేత పట్టాభి రామ్ కొమ్మారెడ్డి విమర్శించారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని, టిడిపి పాలనలో వస్తే అవినీతిని అరికట్టి ఎపి ఆదాయాన్ని పెంచుతామన్నారు. ఎపి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి-టిడిపి-జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జరిగిన అవినీతే వైఎస్‌ఆర్‌సిపి ఓడిపోవడానికి కారణమవుతుందని ఆయన ఆరోపణలు చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ది కనిపించడం లేదని పట్టాభి ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News