Wednesday, January 22, 2025

జగన్… బాబుతో ట్యూషన్ చెప్పించుకో: పట్టాభి రామ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగన్‌కు పరిపాలించడం చేతకాకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ పార్టీ నేత పట్టాభిరామ్ తెలిపారు. ప్రజల కోసం తాము సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, పేదలకు మంచి చేస్తున్నామనే ముసుగులో జగన్ మోసాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టు వద్దన్నా ఆర్5 జోన్‌లో జగన్ పేదలకు సెంటు భూములు ఇచ్చారని పట్టాభిరామ్ మండిపడ్డారు. అక్కడ స్థలాలు ఇవ్వడం వివాదం అని తెలిసినా ఇవ్వడం సరికాదని చురకలంటించారు. బటన్ నొక్కుడు పేరుతో నొక్కేయడానికి డబ్బులు ఉంటాయా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. పేదవాడి ఇళ్ల నిర్మాణానికి జగన్ దగ్గర డబ్బులు లేవా? అని అడిగారు.

Also Read: ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News