Wednesday, January 22, 2025

ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు… ముందే భూములు ఎలా కొంటాం: పట్టాబి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి నాయకుల రాజకీయ జీవితం అయిపోయినట్టేనని టిడిపి నేత పట్టాభి తెలిపారు.  టిడిపి నేత నారా లోకేష్ కంతేరులో భూములు కొన్నారని ఆరోపిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో భూములు కొనాలని 2014 మార్చి 21 నిర్ణయించారని, 2014 మార్చి 21 నాటికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయాని, మార్చి నాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా ఉన్నారన్నారు. పట్టాభి మీడియాతో మాట్లాడారు. మార్చి 2014 నాటి తీర్మానాన్ని పేర్నినాని, సిఎం జగన్ ఒకసారి చూసుకోవాలన్నారు. రాజధాని ముందే ఊహించి కుట్రపూరితంగా భూములు కొన్నారని ఆరోపణలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. అప్పటికే ఎన్నికలే జరగలేదని, ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదని, ముందే ఊహించి భూములు ఎలా కొంటారని పట్టాభి ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థ విస్తరణ కోసం అనేక రాష్ట్రాల్లో భూములు కొన్నామని, అదే విధంగా ఆనాడు భూములు కొనాలని తీర్మానం తీసుకున్నామని తెలియజేశారు.

ఎఫ్‌ఐఆర్ ఫైల్ కాగానే సిఐడికి కూడా హెరిటేజ్ సంస్థ అని వివరాలతో లేఖ రాసిందన్నారు. సిఐడికి లేఖ ద్వారా వాస్తవాలన్నీ హెరిటేజ్ సంస్థే ముందే ఇచ్చామని, తీర్మానం కాపీని సిఐడికి హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ సాంబశివరావు పంపారని గుర్తు చేశారు. సిఐడికి పంపిన తీర్మానం కాపీని ఎందుకు బయటపెట్టలేదని అడిగారు. బోర్డు సమావేశంలో కంతేరులో 7.21 ఎకరాలు కొనుగోలు తీర్మానం చేశారని, మార్చి 2014 తీర్మానం ప్రకారం జులై 1న 7.21 ఎకరాలు కొనుగోలు చేశామని, అదే ప్రాంతంలో జులై 31న మరికొంత భూమి కొనుగోలు చేశామన్నారు. లింగమనేని నుంచి కొన్న 4.55 ఎకరాలు లీగల్ ఇష్యూ ఉండడంతో రద్దు చేసుకున్నామని పట్టాభి వివరించారు.

భారీగా లబ్ధిపొందాలన్న దురాలోచన ఉంటే లీగల్ ఇష్యూ భూమిని సెటిల్ చేయలేరా? అని మండిపడ్డారు. లీగల్ ఇష్యూ ఉందని కోట్లు విలువ చేసే 4.5 ఎకరాలు వదులుకున్నామని, ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టే వివాద భూమిని వదులుకున్నామని తెలియజేశారు. లింగమనేని భూమి ఒప్పందం రద్దు చేసుకున్నాక హెరిటేజ్‌కు మిగిలింది 9.67 ఎకరాలు అని గుర్తు చేశారు. ఏదో కుంభకోణం జరిగిందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి 9-5-2022న ఫిర్యాదు చేశారని, 2016లోనే అంతా తెలుసంటా అన్ని వివరాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారని, చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రముఖ దినపత్రికలలో యాడ్ ఇచ్చిన విషయాన్ని పట్టాభి గుర్తు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డుకు సంబంధించి అభ్యంతరాలుంటే తెలపాలని యాడ్ ఇచ్చామని, 2018 ఫిబ్రవరి 17న ప్రముఖ దినపత్రికలలో ప్రభుత్వం యాడ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News