హైదరాబాద్: నటి పావని రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. బిగ్ బాస్ లో పరిచయమైన అమీర్ ను పావని పెళ్లి చేసుకుంది. సినిమాల్లో నటించడంతో పాటు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. టాలీవుడ్ లో గౌరవం, అమృతం, చందమామ, సేనాపతి, చారీ 111 వంటి చిత్రాలతో వెండితెరపై నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ బ్యూటీ తాజాగా ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బిగ్‌బాస్ 5వ సీజన్ లో పావని కంటెస్టెంట్ అలరించారు. అదే షోలోని కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అమీర్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పావని మొదటి భర్త ఆత్మహత్యే చేసుకొని చనిపోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంది. 2013లో పావని టాలీవుడ్ నటుడు ప్రదీప్ కుమార్‌ను పావని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. పావని మరొకరితో చనువుగా ఉండటంతోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్టు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేశారు.