రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు నటి పవిత్ర గౌడ మంగళవారం బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో నుంచి బయటకు వచ్చింది. ఆమె మిత్రుడు, నటుడు దర్శన్ తూగుదీప కూ ఈ కేసులో ప్రమేయం ఉన్నది. ఈ కేసులో నంబర్ 1 నిందితురాలు పవిత్ర గౌడకు నంబర్ 2 నిందితుడు దర్శన్‌కు, ఇతర నిందితులు ఆర్ నాగరాజు, అను కుమార్ ఉరఫ్ అను, లక్ష్మణ్ ఎం, జగదీష్ ఉరఫ్ జగ్గా, ప్రదూష్ ఎస్ రావులకు కర్నాటక హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
దర్శన్‌ను జూన్ 11న అరెస్టు చేశారు. పవిత్ర గౌడను, కేసులోని ఇతర సహ నిందితులను అదే సమయంలో అరెస్టు చేశారు. దర్శన్ ఇప్పటికే వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై విడుదల అయ్యాడు. రేణుకాస్వామి హత్యకు ‘ప్రధాన కారకురాలు’ పవిత్ర గౌడ అని, ఆమె ఇతర నిందితులను ప్రేరేపించి, వారితో కుట్ర పన్ని హత్యలో పాటుపంచుకున్నదని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.