Monday, December 23, 2024

ట్రోల్స్‌పై పవిత్ర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఆపాలని సినీనటి పవిత్ర హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజుల నుంచి నరేష్, పవిత్రలోకేస్ మధ్య ఉన్న అనుబంధం గురించి నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ జంట త్వరలోనే వివాహం చేసుకుంటారని మొదలైన వివాదం…ఇద్దరు హోటల్ రూములో దొరికేవరకు వచ్చింది.

ఈ సంఘటన తర్వత కూడా ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇటీవల కృష్ణ అంత్యక్రియల్లో ఈ జంట కన్పించడంతో యూట్యూబ్ ఛానళ్లు, కొన్ని వెబ్‌సైట్లు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చడంతో పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది టివి ఛానెల్స్, యూట్యూబర్స్ తమను టార్గెట్‌గా చేసుకుని అభ్యంతరకర కామెంట్స్‌తోపాటు ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని తెలిపింది. తమపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కొన్ని లింకులు పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైం ఎసిపి ప్రసాద్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News