Monday, January 20, 2025

రాజకీయాల్లో పవన్ పెద్ద జోకర్: ఎంపి మార్గాని భరత్

- Advertisement -
- Advertisement -

అమరావతి: వాలంటీర్లు వైసిపి పార్టీ సంబంధం లేకుండా పని చేస్తున్నారని ఎంపి మార్గాని భరత్ తెలిపారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల్లోనే వాలంటీర్లపై మాట మార్చారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటలలో లంచాలు తీసుకునేవారా? కాదా? అని అడిగారు. ఎంపి మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు సంక్షేత పథకాలు అవినీతికి తావు లేకుండా అందిస్తున్నామన్నారు. అక్కచెల్లెమ్మలకు వ్యతిరేకంగా పవన్ వ్యవహరిస్తున్నారని భరత్ దుయ్యబట్టారు. వాలంటీర్లు ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యునిలా ఉంటున్నారని ప్రశంసించారు.

Also Read: ఎపిలో కలకలం.. సంచలనంగా మారిన పవన్ కామెంట్స్

ఈ కుట్రకు కథ ఇచ్చే ఈనాడు పత్రిక అని, నిర్మాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. ఈ కుట్రలో నటుడు పవన్ కలాణ్ అని, రాజకీయాల్లో పవన్ పెద్ద జోకర్ అని భరత్ విమర్శించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.25 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాయని, సచివాలయం వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News