- Advertisement -
సింగపూర్ లోని స్కూల్ జరిగిన అగ్ని ప్రమాద ఘటన తర్వాత ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏనిమిదేళ్ల పవన్ చిన్న కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అతని చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు పవన్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన కుమారుడిని చూసేందుకు నిన్న సింగపూర్ వెళ్లిన పవన్.. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పెద్ద ప్రమాదమేమి లేదని.. కాకపోతే, ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో కొన్ని టెస్టులు చేయాలని పవన్ కు వైద్యులు తెలిపారు. టెస్టుల కోసం మరో మూడు రోెజులపాటు అతన్ని ఆస్పత్రిల్లొనే ఉంచనున్నట్లు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని తెలిపారు. అయితే, గాయపడిన మార్క్ శంకర్ ఫోటో బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
- Advertisement -