- Advertisement -
చంద్రబాబు, బాలినేని, కె.లక్ష్మణ్ లను నామినేట్ చేసిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వీకరించారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా చేనేత వస్త్రాల వినియోగానికి మరింత ప్రోత్సాహం పెంచాలని ఉద్దేశించారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తాను చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలను ట్విటర్ లో పోస్ట్ చేశారు. అనంతరం టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ లను చేనేత ఛాలెంజ్ కు నామినేట్ చేశారు.
- Advertisement -