Friday, April 4, 2025

పవన్, సాయిధరమ్‌ల మూవీ షురూ..

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌ల కాంబినేషన్‌లో సమ్రుద ఖని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదయ సీతం’ సినిమా రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించనున్నారు.

ఈ సినిమాకు పవన్ ఇచ్చిన కాల్షీట్లు 30 మాత్రమే. ఈలోగా పవన్‌పై తీయాల్సిన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక సాయిధరమ్ తేజ్ అయితే పవన్‌తో కలిసి వర్క్ చేయడంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. “నా గురు, మామ అయినటువంటి పవన్ కళ్యాణ్‌తో సినిమాలో కలిసి వర్క్ చేయడం నా జీవితంలో బెస్ట్ డే. దీనిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా”అని పేర్కొంటూ ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News