Wednesday, December 25, 2024

‘మేజర్’ లాంటి సినిమాలు రావాలి

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan appreciates Major Movie

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘మేజర్’. ఇలీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. ‘మేజర్’ లాంటి సినిమాలు రావాలి. ఈ చిత్ర కథానాయకుడు అడివి శేష్‌కి హృదయపూర్వక అభినందనలు. ‘మేజర్’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన స్టార్ హీరో మహేశ్ బాబుకి, చిత్ర నిర్మాతలు శ్రీ శరత్ చంద్ర, శ్రీ అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు’ అని అన్నారు.

Pawan Kalyan appreciates Major Movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News