Monday, January 20, 2025

‘పవన్ కల్యాణ్! దయచేసి పిఠాపురం పరువు తీయకు’

- Advertisement -
- Advertisement -

పవన్ కల్యాణ్ పిఠాపురం పరువు తీసేలా మాట్లాడుతున్నారని వైసీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. దయచేసి పిఠాపురాన్ని అప్రదిష్టపాలు చేసేలా మాట్లడకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పవన్ కల్యాణ్, వంగా గీత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కూటమి నేతలంతా కలసి ప్రజలకు వాలంటీర్లను దూరం చేశారని, ప్రజలను చులకన చేసే విధంగా పవన్ కల్యాణ్ డబ్బు, కంటైనర్లు అంటూ మాట్లాడటం తగదని గీత అన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి పాతికేళ్ళుగా ఎంతో సేవ చేశానని, ఈసారి ప్రత్యేక ఎజెండాతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News