Tuesday, December 24, 2024

జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్, వైసిపి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ లో స్పందించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ తెలుగువారి ఎమోషన్ అని తెలిపారు. త్యాగం, గౌరవం, స్ఫూర్తికి చిహ్నం విశాఖ ప్లాంట్ అని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వం చేతుల్లోనే ఉండి మంచి లాభాలు తీసుకరావాలన్నారు. రిషికొండ తవ్వకాలను కప్పిపుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లు అంటిస్తారా? అని వైసిపి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. చెట్ల నరికివేత, తీర ప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం, కొండలను తొలగించడం వైసిపి దుష్ట పాలకుల ముఖ్యలక్షణం అని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ఉల్లంఘించిన నిబంధనలను నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందా?.. జగన్ ప్రభుత్వం సమాధానం చెబుతుందా? లేక రిషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తారా? అని అడిగారు.

Also Read:  నదిలో మొసలితో పోరాడి భర్తను కాపాడిన భార్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News