Sunday, January 19, 2025

గంజాయిలో తొలి స్థానానికా గర్జనలు: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan to sign 2 remake movies?

అమరావతి: దేనికి గర్జనలు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా తన ట్వీట్టర్ లో ట్వీట్లు చేస్తున్నారు. అందమైన అరకును గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని మండిపడ్డారు. గంజాయి కేసుల్లో ఎపిని తొలి స్థానంలో నిలిపారని చురకలంటించారు. రోడ్లు వేయడం లేదు కానీ చెత్త మీద పన్నులు వేస్తున్నారా? అని అడిగారు. పిఆర్‌సిపై మాట మార్చారని, ఉద్యోగులకు జీతాలివ్వడం లేదని, పోలీసులకు టిఎ, డిఎలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై అసెంబ్లీలో చెప్పిన దానికి భిన్నంగా ఎందుకు చేస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆపలేకపోయారని, రుషికొండను ధ్వంసం చేసి భవనం నిర్మించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇవన్నీ చేస్తున్నందుకు గర్జనలా? అని పవన్ అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News