Monday, January 20, 2025

తెలంగాణ ప్రజలను కించపరచవద్దు: పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై వైసిపి మంత్రుల తీరు బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు వర్సెస్ ఎపి మంత్రుల వివాదంపై పవన్ కల్యాణ్ స్పందించారు.  వైసిపి నేతలు నోరు అదుపులోకి పెట్టుకోవాలని పవన్ సూచించారు. వైసిపి నేతలు తిట్టాలి అనుకుంటే వ్యక్తినే టార్గెట్ చేయాలని కానీ మొత్తం తెలంగాణ ప్రజలను ఇందులోకి లాగొద్ధని సూచించారు. ఒక వ్యక్తి విమర్శ చేస్తే ఆ వ్యక్తి పరంగాను ప్రతి విమర్శ ఉండాలని, నేతల వ్యాఖ్యలకు ప్రజలను భాగస్వాములను చేయొద్దన్నారు. తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం తగదని ఎపి మంత్రులకు పవన్ హితువు పలికారు.

Also Read: వెలివాడల్లో వెలుగులు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News