Sunday, January 19, 2025

సీఐ అంజు యాదవ్‌పై ఎస్పికి జనసేనాని ఫిర్యాదు..

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై ఎస్పికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఇటీవల శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్త కొట్టే సాయిని సీఐ అంజూ యాదవ్ చెంప దెబ్బలు కొట్టిన విషయం తెలసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన కార్యకర్తలపై సీఐ అంజూ యాదవ్ అనుచిత ప్రవర్తనపై జనసేన పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికి దిగారు.

ఈ రోజు తిరుపతికి చేరుకున్న పవన్, భారీ ర్యాలీతో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఐ అంజు యాదవ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్పి పరమేశ్వర్‌రెడ్డికి పవన్ ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News