Monday, December 23, 2024

పవన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రియ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి హీరోయిన్ శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎపిలో రానున్న రోజుల పవన్ కల్యాణ్ అద్భుతాలు చేస్తారని కొనియాడారు. ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడు ఆలోచించేవాడన్నారు. హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడారు. బాలు సినిమాలో పవన్‌తో కలిసి పని చేశామని, ఆయన ఎక్కువగా శ్రమను నమ్ముకుంటారని, సైలెంట్ ఉంటారని తెలియజేశారు.

బాలు సినిమాలోని ఓ పాటకు షూటింగ్ చేస్తుండగా పవన్ కల్యాణ్ కాలికి గాయమైందని, పాట పూర్తి చేసేవరకు ఆ విషయాన్ని ఎవరితో చెప్పలేదన్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయాలని అనుకుంటున్నానని శ్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగులో తేజ సజ్జా మూవీ కోసం ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నానని, ప్రస్తుతం ‘షో టైమ్’ అనే కార్యక్రమం కోసం పని చేస్తున్నానని వివరణ ఇచ్చారు. బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయని, సినిమాకు ఇప్పుడు భాషతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కథనం బాగుంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏది ఇష్టమని విలేకరి ప్రశ్నించగా ఇండియన్ సినిమా ఇష్టమని చెప్పి అక్కడి నుంచి ఆమె తప్పించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News