విజయవాడ: ఎవరికైనా కష్టం వచ్చింది అంటే చాలు వాళ్లని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఎప్పుడు ముందుటారు. పదవిలో ఉన్న లేకపోయినా.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన మరోసారి తన ఉదారత చాటుకున్నారు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఎలాంటి హడావుడి లేకుండా సేవలు చేసే ఎన్టీఆర్ ట్రస్ట్ మరో వందేళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇటీవలే పద్మభూషణ్ ఆవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు ఆయన అభినందనలు తెలిపారు. ఇక తన వంతు సహాయంగా ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.