- Advertisement -
జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభపక్ష నేతగా పవన్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదేండ్ల మనోహర్ ప్రతిపాదించారు. జనసేన ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
కాగా, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన 21 ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుచి 71 వేల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
- Advertisement -