Sunday, November 24, 2024

పవన్ ప్రచార రథం నిబంధనలకు విరుద్దం..

- Advertisement -
- Advertisement -

పవన్ ప్రచార రథం నిబంధనలకు విరుద్దం..
ఆలివ్ కలర్‌ను ఆర్మీవాళ్ళు మాత్రమే వినియోగించాలి
ఏపీ అదనపు ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాపారావు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దం చేసుకున్న వాహనం రవాణా నిబంధనలకు విరుద్దంగా ఉందని ఏపీ అదనపు ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాపారావు తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రచారం రధానికి సంబంధించిన కొన్ని ఫోటోలు తాను చూశానని, ఆ ఫోటోస్‌లో సదరు వాహనం ఆలివ్ గ్రీన్‌లో ఉందన్నారు. కేంద్ర వాహాన చట్టం ప్రకారం ఆర్మీకి వాళ్ళు మాత్రమే గ్రీన్ కలర్ వినియోగించాలని, ఇతర ప్రవేట్ వ్యక్తులు అటుంటి కలర్‌ను వినియోగించకూడదన్నారు.

పవన్ కళ్యాన్ సదరు ప్రచార వాహనానికి కలర్ అదే ఉంచుతారా లేదా అనేది తనకు తెలియదని ఒక వేళ అదే కలర్‌ను వినియోగించినట్లుయితే ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుందన్నారు. వాహన చాసిస్‌ను బట్టి అది ట్రాన్స్‌పోర్టు వాహనమా? గూడ్స్ వాహనమా అనేది తెలుస్తుందన్నారు. చాసిస్‌కొనుగోలు చేసే ముందు అది గూడ్స్ వాహనం కోసమా, ప్యాసింజర్ వాహనం కోసమా అనేది తెలియాలన్నారు. ఒక వేళ ట్రాన్స్‌పోర్టు వాహనమయితే దాన్ని గూడ్స్ వాహనంగా మార్చకూడదని, గూడ్స్‌వాహనమయితే క్యాంప్ వ్యాన్‌మార్చకూడదన్నారు.

రాయిల్ ఇన్‌ఫీల్డ్ బైక్ కలర్స్, డిజైన్ వేరు…
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆలీవ్ గ్రీన్ కలర్ ప్రచారం రధం ఉపయోగించిన సమయంలో ఇన్ని నిబంధనలు లేవని ఏపీ అడిషనల్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రసాదరావు గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్ రోజు సదరు వాహన బాడీ ఎత్తు, వెడల్పు అనేది పరిమాణానికి తగ్గట్లు ఉందా లేదా అని మాత్రమే చూస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News