Monday, December 23, 2024

దాడులు చేసి కేసులు పెడతారా: పవన్‌కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికారపార్టీ నేతల అక్రమాలను అడ్డుకున్నందుకు జనసేన కార్యకర్తలపైన దాడులు చేసి మళ్ళీ కేసులు పెడతారా అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైపిపి నేతలను ప్రశ్నించారు. వైసిపి నేతల రాక్షసపాలనకు అంతులేకుండా పోతుందన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడురూ మండలం ఆకుమర్రు ,ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జనసైనికుల పైన వైసిపి దుండగులు జరిపిన దాడుల్లో 15మంది గాయపడ్డారని తెలిపారు. రెండు చోట్ల దాడులకు కారణం ప్రజల తరుపున వైసిపి నేతల అక్రమాలను ప్రశ్నించినందుకే అన్నారు.

Also Read: పదవి పోతుందనే రేవంత్ కన్నీళ్లు : బండి సంజయ్

రెండు చోట్ల దాడులు చేసిన వారే పోలీస్ కేసులు పెట్డడం , అది కూడా సానుభూతి కోసం మహిళలతో కేసు పెట్టించడం వైసిపి నేతల వికృత చేష్టలకు పరాకాష్ట అన్నారు. చెరువులను ఆక్రమిస్తున్నారని తెలిసి జనసేన కార్యకర్తలు అక్కడికి వెళ్లి ఫొటోలు తీసుస్తుండగా వారిని నిర్భందించి తీవ్రంగా హింసించి వారి పైనే తిరిగి ఎదురు కేసులు పెట్టారన్నారు. జగనన్న స్టిక్కర్లు తమ ఇళ్లకు అంటించవద్దని వారించినందుకు జన సైనికుల పైన విచక్షణ రహితంగా దాడి చేయించగా 15మంది గాయపడ్డారన్నారు. వైసిపి రాక్షస సంస్కృతిని పెంచి పోషిస్తోందన్నారు. అసలు దోషులపైన కేసులు పెట్టకపోతే న్యాయస్థానాలను అశ్రయించక తప్పదన్నారు. గాయపడిన జనసైనికులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News