Monday, December 23, 2024

జనసేన అంటే వైసిపి నాయకులకు భయం పట్టుకుంది: పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan Fires on YSRCP Leaders

విశాఖ: వందలాది మంది తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండీ పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారని మండిపడ్డారు. అరెస్టు చేసిన మా నాయకులు వచ్చే వరకు తాను వైజాగ్ లోనే ఉంటానని తేల్చిచెప్పారు. అధికారం ఉన్నవాళ్లు గర్జించడం ఏంటని పవన్ ప్రశ్నించారు. చాలామంది జనసేన నాయకులను జనవాణికు రాకుండా ముందస్తు హౌస్ అరెస్టలు చేశారని చెప్పారు. నేరస్తులకు కొమ్ముకాసి.. అమాయకులను అరెస్టు చేస్తారా? అంటూ పోలీసులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసు అన్నది సీఎం జగన్ ది పెద్ద డ్రామా అన్నారు. దాడి సమయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు పోలీసు బందోబస్తు లేదా.. ఉంటే ఏమైనట్లు అని ఆయన ప్రశ్నించారు. జనసేన అంటే వైస్సార్ సిపి నాయకులకు భయం పట్టుకుందన్నారు. కోనసీమలో ఎలా ఉద్రిక్తత నెలకొందో.. ఇప్పుడు విశాఖ లో అలాగే సృష్టించారని పవన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News