Wednesday, January 22, 2025

‘హరిహర వీరమల్లు’ వచ్చేది అప్పుడేనా..?

- Advertisement -
- Advertisement -

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను సెట్స్ పైకి తెచ్చి చాలా కాలమైంది. గత ఏడాది నుంచి ఈ సినిమా విడుదల తేదీపై ఊహించని మార్పులు జరుగుతున్నాయి. అసలు ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా అనేక రకాల డేట్స్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఒక విధంగా కరోనా వలన అతి పెద్ద గ్యాప్ వస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలు కారణంగా షూటింగ్‌కు మరికొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు క్రిష్ అయితే పవన్ కళ్యాణ్ లేకపోయినప్పటికీ అతనితో అవసరం లేనటువంటి కొన్ని సన్నివేశాలను అయితే ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరొకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించున్నారట. ఇక దర్శకుడు క్రిష్ కూడా ఈసారి ప్రక్క ప్రణాళికతో ఈ స్టార్‌తో కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకుని షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను 2023 సమ్మర్‌లో విడుదల చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలిసింది. అయితే 2023 మంచి సంక్రాంతిని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చే సమ్మర్ ను ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అని పవన్ కళ్యాణ్‌తో ఇదివరకే రెండుసార్లు చర్చలు జరిపారు. పవన్ కూడా మరొక సినిమా షూటింగ్ పెట్టుకోనని కేవలం ఈ సినిమా కోసమే పని చేస్తాను అని మాట ఇచ్చాడని సమాచారం. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌కు వస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News