Monday, November 18, 2024

3 గెటప్‌లు, 30 వెరైటీ దుస్తులలో..!

- Advertisement -
- Advertisement -

Pawan's 'Hari Hara Veera Mallu' first glimpse released

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ మొదటిసారి చేస్తున్న చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవన్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాలో పవన్ స్టార్ గెటప్‌కు సంబంధించి చాలా రీసెర్చ్ చేశారట కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య రాజీవ్. ఈ సినిమాలో పవన్ మూడు విభిన్నమైన గెటప్‌లలో, 30 వరకు వెరైటీ దుస్తులలో కనిపిస్తాడని టాక్. అలా ఈ స్టార్ హీరో వేషధారణ కోసం ఐశ్వర్య దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని 1000 థానుల ఫ్యాబ్రిక్స్‌ను తెప్పించి డిజైన్స్ ప్లాన్ చేసిందట.ఇదివరకు డైరెక్టర్ క్రిష్‌తో ఐశ్వర్య కంచె, గౌతమిపుత్రశాతకర్ణి సినిమాలకు పనిచేసి అవార్డులు కూడా అందుకుంది. ఇక, 17వ శతాబ్దానికి చెంది మొఘల్ కాలం, కుతుబ్‌షాహీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ‘హరిహర వీరమల్లు’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.

Pawan Kalyan has 3 getups in Hari Hara Veera Mallu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News