Tuesday, September 17, 2024

పవన్ చేతికి ‘డ్రైవింగ్ లైసెన్స్’?

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan

 

2019లో మలయాళంలో వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఎప్పుడో మొదలు కాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్‌తో చేయాలని ప్రయత్నిస్తున్నాడట. ఆ నిర్మాత పవన్‌ని ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ చూడమని కూడా కోరాడట. మరి పవన్ కళ్యాణ్ ఓకే చేస్తే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో పట్టాలెక్కే సూచనలు కలవు. డైరెక్టర్ లాల్ జూనియర్ తెరకెక్కించిన ఈ మూవీలో పృథ్విరాజ్ హీరోగా చేశారు. ఓ సూపర్ స్టార్‌కి అతని అభిమాని అయిన ఆర్‌టిఓ ఆఫీసర్‌కి మధ్య జరిగే పోరుగా ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించడం జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News