- Advertisement -
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ వీరుడు అని మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. సిఎం జగన్ పై పవన్ విమర్శలు చేసినందుకు శంకర్ రీకౌంటర్ ఇచ్చారు. ఒకసారి టిడిపి-బిజెపి మరోసారి కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారని, 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఎపి ప్రజలు టిడిపి, జనసేన వైపు చూడటం లేదని, ప్రజలు సంతోషంగా ఉంటే జనసేనకు నిద్రపట్టడంలేదని చురకలంటించారు.
- Advertisement -