Sunday, January 19, 2025

పవన్ ప్యాకేజీ స్టారే: ఎపి మంత్రి

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం:  విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికే పవన్‌ విశాఖకు వచ్చారని ఎపి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పవన కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. దురుద్దేశంతోనే ఎపి మంత్రులపై దాడి చేశారని, దాడి చేసిన వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపి సిఎం చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని, ఉత్తరాంధ్రులను గుండెల మీద తన్నడానికి టిడిపి అదినేత మాజీ సిఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.  ప్రజలను రెచ్చగొట్టే, విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం కాదా? అని అడిగారు. పవన్ ఎంత ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుతో కలిశారని ప్రశ్నించారు. పవన్‌ను పరామర్శించడానికి చంద్రబాబు పరిగెత్తుకుంటూ వచ్చారన్నారు.

పవన్ కల్యాణ్ మొదటి భార్యకు ప్యాకేజీ ఇచ్చి రెండో భార్యను చేసుకున్నాడని, రెండో భార్యకు ఆస్తులు ఇచ్చి మూడో భార్యకు పెళ్లి చేసుకున్నాడని చురకలంటించారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్యాకేజీ తీసుకోలేదని నిరూపించుకోవాలనుకుంటే జనసేన పార్టీ  175 స్థానాలలో పొటీ చేయాలని సవాలు విసిరారు. పవన్ కు దమ్ముంటే జనసేన పార్టీ టిడిపి అనుబంధ సంస్థ కాదని నిరూపించుకోవాలని సవాలు విసిరారు.  పవన్‌కు కుటుంబం అంటే నైతికత అంటే అవగాహన లేదని, ఒక మహిళను వివాహం చేసుకుని విడాకులు ఇవ్వకుండా.. మరో మహిళతో సహజీవనం చేస్తూ మరో మహిళకు కడుపు చేయడం పవన్ సంస్కృతి అని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News