Monday, April 14, 2025

మార్క్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ లేటెస్ట్ అప్‌డేట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడి మెరుగైన వైద్యం అందడంతో ప్రస్తుతం మార్క్ కోలుకున్నాడు. అయితే మార్క్ తాజా ఆరోగ్య పరిస్థితిపై పవన్‌ ‘ఎక్స్’ వేదికగా అప్‌డేట్ ఇచ్చారు.

‘సింగపూర్‌లో సమ్మర్ క్యాంప్‌లో జరిగిన దుర్ఘటనలో గాయపడిన నా కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అతని కోసం ప్రపంచం నలుమూల నుంచి ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ క్లిష్ట సమయంలో నా వెంట ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సినిమా కుటుంబసభ్యులు, మిత్రులు, మద్దతుదారులు అందరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ పవన్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

శనివారం రాత్రి పవన్‌కళ్యాణ్, ఆయన సతీమణి అన్నాలెజినోవాలు మార్క్‌ని హైదరాబాద్ తీసుకువచ్చారు. వీరితో కుమార్తె పొలెనా అంజనా పవనోవా కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News