Friday, December 20, 2024

‘ఉస్తాద్ భగత్ సింగ్’ బర్త్ డే స్పెషల్ పోస్టర్

- Advertisement -
- Advertisement -

ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేకర్స్ కొత్త పోస్టర్‌ ని విడుదల చేశారు. ఖాకీ చొక్కా, గళ్ళ లుంగీ ధరించి, స్పోర్ట్స్ షేడ్స్‌తో పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్ పోస్టర్‌లో చూడవచ్చు.

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని మునుపెన్నడూ లేని మాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నారు. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ రక్తంతో తడిచిన కత్తి పట్టుకుని వుండగా, అతని వెనుక కొంత మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఇది అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని  గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మేకర్స్ ముందుగా అనౌన్స్ చేసినట్లు ఈ నెల 5 నుండి సినిమా షూటింగ్‌ ని తిరిగి ప్రారంభించనున్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News