Sunday, January 19, 2025

ఢిల్లీలో బిజేపి అగ్ర నేతలతో పవన్ భేటీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతాపార్టీ అగ్రనాయకులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం ఆంధప్రదేశ్ రాష్ట్ర బిజేపిపార్టీ ఇంచార్జ్ కేంద్రమంత్రి మురళీధరన్‌తో సమావేశమై ఏపికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు. పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులతోపాటు జనసేన, బిజేపి కార్యచరణపై చర్చించినట్టు సమాచారం.

ఇటీవల బిజేపి జనసేన మధ్యన దూరం పెరిగిన నేపధ్యంలో సోమవారం జరిగిన భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. . బిజేపి అగ్రనేతలు కేంద్ర మంత్రి అమిత్‌షా, బిజేపి అధ్యక్షుడు నడ్డాతోపాటు మరికొందరు నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని వారితో భేటి అనంతరం అన్ని విషయాలు ఒకే సారి వివరిస్తామని పవన్ కల్యాణ్ మీడియాతో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News