Sunday, January 19, 2025

వైసిపి కుట్ర ఉంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కందుకూరు, గుంటూరు ఘటనలో వైఎస్‌ఆర్‌సిపి కుట్ర దాగి ఉందని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడారు. వైసిఆర్‌సిపి కుట్రను పోలీసులు అమలు చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి మీటింగ్‌లు పెడుతుందని కానీ టిడిపికి అనుమతి ఇవ్వడం లేదన్నారు. సభల కోసం తాము ప్రైవేట్ స్థలాలు చేసుకోవాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అవసరాన్ని బట్టి పోతులు పెట్టుకుంటామన్నారు. ఎమర్జెన్సీ కంటే ఇప్పుడు దారుణ పరిస్థితులున్నాయని, పోలీసులు అర్థరాత్రి వచ్చి గోడలు దూకుతున్నారన్నారు. అవసరమైనప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పొత్తులపై మాట్లాడానికి ఇంకా చాలా సమయం ఉందని, ఎన్నికలప్పుడు పొత్తులుంటాయని చంద్రబాబు వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ తమ లక్షమన్నారు. పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటంలో స్థలం ఇస్తే వాళ్ల ఇళ్లను కూల్చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News