- Advertisement -
ఆదివారం హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ రెండున్నర గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎపి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 ద్వారా కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని పవన్ తప్పుపట్టారు. ఈ ఘటనపై చంద్రబాబుకు పవన్ సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎపిలో బిఆర్‌ఎస్ పోటీపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఎపిలో బిఆర్‌ఎస్ పోటీ చేస్తే తమకెందుకు అభ్యంతరం ఉంటుందని పేర్కొన్నారు.
- Advertisement -