అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ములాఖత్‌లో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ 45 నిమిషాలు పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. అందులో భాగమే చంద్రబాబు అరెస్టు అయ్యారని, చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని వివరించారు. 2020విజన్‌తో చంద్రబాబు ముందుకు వెళ్లారని, బాబు శక్తి సామర్థాలను తక్కువ అంచనా వెయొద్దని సూచించారు. గతంలో స్పెషల్ స్టేటస్ తీసుకరాలేదని చంద్రబాబుతో విభేధించానని పవన్ చెప్పారు.
Also Read: పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఉరేసుకున్న మహిళా కానిస్టేబుల్
లక్షలాది టర్నోవర్‌ను తీసుకొచ్చే హైటెక్ సిటీని చంద్రబాబు నిర్మించారని పొగిడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి చేసేవి అన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలేనని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో మూడో వంతు వారి జేబుల్లోకే వెళ్తోందని దుయ్యబట్టారు. వైసిపి వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పారు. వైఎస్ వివేకా నందా మర్డర్ కేసులో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయని పవన్ ఆరోపణలు చేశారు. ఎపిని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చేశావని ధ్వజమెత్తారు. జగన్‌ది పాలన కాదని, ప్రజల పాలిట పీడన అని దుయ్యబట్టారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తాయని, బిజెపి కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. జగన్ యుద్ధమే కావాలనుకుంటే యుద్ధానికి తాము రెడీగా ఉన్నామన్నారు.