Thursday, December 19, 2024

చంద్రబాబును కలిసిన పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలు జరిపారు. 16 అసెంబ్లీ, 17 ఎంపి అభ్యర్థుల ఖరారు దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 26నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని పవన్ ప్రణాళికలు వేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

సిఎం జగన్ మోహన రెడ్డి గత హామీలపై బదులిచ్చాకే బస్సు యాత్ర చేపట్టాలని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని జగన్ దోపిడీకి వెచ్చించారని, 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకమని స్పష్టం చేశారు. విశ్వసనీయతపై జగన్ కబుర్లు అతిపెద్ద నాటకమని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News