Friday, December 20, 2024

పొత్తుపై కీలక నిర్ణయమా? చంద్రబాబుతో పవన్ భేటీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మధ్య కాలంలో జరిగిన మూడో భేటీలో రాష్ట్ర పరిస్థితులు, ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. రాజకీయంగా పొత్తు పెట్టుకోవడంతోపాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాడే అవకాశాలపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల ఢిల్లీలో పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన తర్వాత జనసేన అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధికార వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేనలు ఏకమై పోరాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇప్పుడు చంద్రబాబుతో పవన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News