- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. దాదపుగా రెండు గంటలపాటు ఇరువురి మద్య సమావేశం సాగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతకు ఉన్న హక్కులు వైకపా ప్రభుత్వం కాలరాసిందన్నారు.ఇప్పటంలో సమావేశానికి ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని,ప్రజలే స్థలం ఇచ్చారని అన్నారు. స్థలం ఇచ్చిన ప్రజల ఇళ్లు కూల్చే చర్యలు ప్రభుత్వం చేపట్టారన్నారు.
వైసిపి కుట్రలో భాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయన్నారు. ఎపిలో పింఛన్లు తొలగింపు వంటి అంశాలను చర్చించినట్లు ఆయన తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి జీవో ఎపిలో తెచ్చారని, విపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. జీవో నం.1 కు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించామన్నారు. ఎపిలో ఆరాచక పాలన సాగుతుందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
- Advertisement -