Monday, December 23, 2024

వాణి జయరాం మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ గాయని వాణి జయరాం ఆకస్మిక మరణం పట్ల జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలుగు భాషతో పాటు తమిళ, హింది, కన్నడ, మలయాళ భాషల్లో వాణి జయరాం ఆలపించిన గీతాలు శ్రోతలను అమితంగా మెప్పించాయని పేర్కొన్నారు. శంకరాభరణంలో ఆలపించిన పాటలను ఇప్పటికీ మరచిపోలేమన్నారు.

పూజ, సీతాకొకచిలుక, స్వాతి కిరణం లాంటి చిత్రాల్లో గీతాలు వాణి జయరాం గాన ప్రతిభను తెలియజేస్తాయని గుర్తుచేసుకున్నారు. ఇటీవల పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన వాణి జయరాం ఆ పురస్కారం స్వీకరించకుండానే కన్నుమూయడం బాధకరమని అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News