Tuesday, January 7, 2025

పవన్‌కు మానసిక వైద్యుడు అవసరం: అంబటి రాంబాబు

- Advertisement -
- Advertisement -

పల్నాడు: ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖను ఓ కోరిక కోరుతున్నానని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసిపి నేతలపై పవన్ హాట్ కామెంట్లు చేయడంతో అంబటి రీకౌంటర్ ఇచ్చారు. పవన్ వెళ్లేటప్పుడు వెనుక ఓ అంబులెన్స్ ఏర్పాటు చేసి దానిలో మానసిక వైద్యుడిని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మానసిక స్థితి లేని వారికి ఏ మందులు వాడతారో అవి అంబులెన్స్‌లో వైద్య శాఖ పెట్టాలని అంబటి సూచించారు. పవన్ మానసిక స్థితి బాగోలేకపోతే మందులిచ్చి వారాహి వాహనం ఎక్కించాలని చురకలంటించారు. వారాహి ఎక్కిన దగ్గర నుంచి పవన్ పిచ్చి మాటాలు మాట్లాడుతున్నారని, ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తంతాను అని మాట్లాడుతున్నాడని, లేకపోతే జనసేన కార్యకర్తలు చొక్కాలు పవన్ చించుతారా? అని అడిగారు. నువ్వు బట్టలిప్పి కొట్టడానికి ఇది సినిమా కాదన్నారు.

Also Read: వీధి రౌడీ భాషలో మాట్లాడటం సరికాదు పవన్: ముద్రగడ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News