Monday, December 23, 2024

ఆ టాలెంటెడ్ డైరెక్టర్‌తో పవన్ మూవీ?

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan next movie with director Sudheer Varma

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం వరుసగా సరికొత్త సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. దీనికోసం సన్నిహితుడైన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహాయం తీసుకుంటున్నాడని టాక్. ’పింక్’ రీమేక్‌గా పవన్‌కళ్యాణ్ కమ్‌బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ను సెట్ చేయడంలో.. దర్శకుడు వేణు శ్రీరామ్ చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టడం వెనుక త్రివిక్రమ్ పాత్ర కూడా ఉంది. మలయాళ సినిమా ’అయ్యప్పనుమ్ కొశీయుమ్’ రీమేక్ ని పవన్ దగ్గరకు తీసుకెళ్లింది కూడా ఆయనే. అంతేకాదు దీనికి స్క్రీన్‌ప్లే , మాటలు అందించి ‘భీమ్లా నాయక్’ సినిమా బ్లాక్‌బస్టర్‌లో భాగమయ్యారు త్రివిక్రమ్.

ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కోసం మరో కొత్త ప్రాజెక్ట్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడని.. దీనికి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ‘శాకినీ డాకినీ’ అనే చిత్రాన్ని పూర్తి చేసిన సుధీర్ వర్మ.. ప్రస్తుతం రవితేజతో ’రావణాసుర’ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడని అంటున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, – స్క్రీన్ ప్లే, – డైలాగ్‌లు అందించనున్నాడట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై ఈ ప్రాజెక్ట్ రూపొందనుందట. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News