ఏపిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపికి ఓటమి తప్పదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ణతతో ఓట్లు వేశారని , 81.86శాతం పోలింగ్ నమోదు కావటమే అందుకు నిదర్శనం అన్నారు. వైసిపి పోలింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించేందుకు, బెదిరింపులకు , డాడులకు పాల్పడ్డా ఓటర్లు వెనకంజ వేయకుండా తమ హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో తాను భారీ మెజారిటీతో విజయం సాధించనన్నట్టు వెల్లడించారు. పోలింగ్ అనంతరం కూడా వైసిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి అభ్యర్ధి అఖిలప్రియ గన్‌మెన్‌పై దాడికి దిగారని, తాడిపత్రిలో అశాంతి రేపారన్నారు. హింసకు పాల్పడే వారే ఎన్నికల సంఘాన్ని , పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందున్నారు. పోలింగ్ అనంతరం హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రతను మరింతగా పెంచాలని ఎన్నిలక సంఘానికి విజ్ణప్తి చేశారు. జూన్ 4న వచ్చే ప్రజాతీర్పుతో వైసిపి మరో సారి హింసకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ ఈ మేరకు ఒక ప్రకటనలో విజ్ణప్తి చేశారు.