అమరావతి: పిఠాపురం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి వర్మ జనసేన మద్దతిచ్చి సీటు త్యాగం చేశారని, వర్మను భవిష్యత్తులో ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పిఠాపురం శాసనసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కాకినాడ అభ్యర్థి ఉదయ్ ఇక్కడి సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించారని, మే ఒకటో తేదీన ఇంటివద్దే పెన్షన్లు ఇవ్వాలని, లేకుంటే వైసిపి కుట్ర ఉన్నట్లేనని చురకలంటించారు. టిడిపి జనసేన, బిజెపి కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాన్ నామినేషన్ ర్యాలీకి అభిమానంతో స్వచ్చందంగా వేలాదిగా ప్రజానీకం పిఠాపురం కదిలి వచ్చారు. పిఠాపురం నియోజక వర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి వర్మ, ఆయన సతీమణి హారతులిచ్చారు. పవన్ ను నటుడు నాగబాబు ఆశీర్వాదించారు.
వర్మను ఉన్నత స్థానంలో కూర్చోబెడతాం: పవన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -