Thursday, January 23, 2025

పొత్తుల ప్రస్తావన రాలేదు: పవన్‌ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

పొత్తుల ప్రస్తావన రాలేదు
అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం
ఢిల్లీలో బిజేపి నేతలతో ముగిసిన జనసేన పార్టీ చర్చలు
మీడియాకు చర్చల సారాశం వెల్లడించిన పవన్‌కళ్యాణ్
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన తమ మధ్యన రాలేదని జనసేన అధ్యక్షుడు వపన్‌కళ్యాణ్ వెల్లడించారు. ఆంధప్రదేశ్ లో అధికారం సాధించే దిశగా బిజేపితో కలిసి అడుగులు వేస్తున్నామని అన్నారు. ఢిల్లీలో బిజేపి అగ్రనేతలతో రెండు రోజులపాటు ఏపి రాజకీయాలపై పవన్ చర్చలు జరిపారు. మంగళవారం భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో ఆయన నివాసంలో సమావేశంమయ్యారు. సుమారు 45నిమిషాల పాటు చర్చించారు అంతకు ముందు మరో మారు బిజేపి ఏపి రాజకీయవ్యవహారాల ఇంచార్జి మరళీధరన్‌ను కలిసి గంటపాటు చర్చలు జరిపారు. ఇరువురు నేతలతో చర్చల అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.

ఏపిలో అధికారం సాధించే దిశగా బిజేపి నేతలతో చర్చలు జరిగినట్టు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకూడదన్నదే తన అభిమతం అని తెలిపారు. వైసిపి విముక్త ఏపిని చేయటమే బిజేపి జనసేన పార్టీల లక్షం అని, ఆ దిశగా అడుగులు వేయనున్నట్టు తెలిపారు.రాష్ట్ర రాజకీయాలు, అభివృద్దిపై నడ్డాతో చర్చలు జరిపామన్నారు. రాష్ట్రంలో అవినీతి , ఘర్షణ వాతావరణంపై చర్చించినట్టు తెలిపారు. బిజేపి, జనసేన పార్టీలు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. రాజకీయ పొత్తుల అంశం చర్చకు రాలేదన్నారు. రానున్న రోజుల్లో అన్ని విషయాలు చెబుతామన్నారు.

బిజేపి నేతలతో రెండు రోజుల పాటు జరిగిన చర్చలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని పవన్‌కళ్యాణ్ వెల్లడించారు.బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి శివప్రకాష్‌జితో కూడా చర్చల్లో పాల్గొన్నారు. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటి అయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని విజ్ణప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో వైసిపి ప్రభుత్వం నిర్లక్షం చేస్తుందని ఆరోపించారు. బిజేపి నేతలతో జరిగన చర్చల్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News