Wednesday, January 22, 2025

మంగళగిరిలో పవన్: క్యూకట్టిన నిర్మాతలు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా పర్యటించేందుకు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళయాణ్ మంగళగిరి చేరుకోవడంతో ఆయన వెంటనే సినీ నిర్మాతలు, దర్శకులు అక్కడకు క్యూకట్టారు.

వారాహి రథంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాత్ర చేసేందుకు పవన్ కళ్యాణ్ ఈ నెల 12న మంగళగిరి చేరుకోగా ఇక పవన్ రాష్ట్రంలోనే ఎక్కువ కాలం గడుపుతారని భావిస్తున్న నిర్మాతలు మంగళగిరి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలలో తమ షూటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు వై రవి శంకర్, వివేక్ కూచిబొట్ల, ఎఎం రత్నం, డివివి దానయ్య గత సోమవారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలుసుకుని ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. మరో నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మంగళవారం పవన్ కళ్యాణ్‌ను కలుసుకుని జనసేన పార్టీలో చేరిపోయారు. పవన్ వారాహి యాత్ర బుధవారం అన్నవరం నుంచి ప్రారంభమైంది.

తాము గతంలో రాజమండ్రి, విశాఖపట్నంలో షూటింగ్ చేసినా ఇక్కడకు రావడం మాత్రం ఇదే మొదటిసారని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. మంగళగిరి, విజయవాడ, పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేయడానికి అనుకూలంగా ఉన్నట్లు గ్రహించామని, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉన్నందున ఈ పరిసర ప్రాంతాలలోనే షూటింగ్ చేయాలని నిర్ణయించామని, ఇదే విషయాన్ని తమ నిర్మాతలతో చర్చిస్తున్నామని ప్రస్తుతం పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్న హరీష్ శంకర్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ చిత్రాలే కాకుండా రవి శంకర్, వివేక్, రత్నం, దానయ్య నిర్మించే ఇతర చిత్రాలు కూడా విజయవాడ పరిసరాలలో షూటింగ్ జరుపుకోనున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News