హైదరాబాద్ ః శ్రీకాకుళం జిల్లా రణస్థలి జనసేన యువశక్తి సభా వేదికపై ఎపి సిఎం జగన్‌ను మూడు ముక్కుల ముఖ్యమంత్రి అంటూ తీవ్రస్థాయిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. రెండు ముక్కలైన రాష్ట్రాలను మూడు ముక్కలు చేద్దామన్న కుతంత్రాలు అంటూ మండిపడ్డారు. ఈ మూడు ముక్కల ఆలోచనలు వైసీపీకి చాల ఎక్కువని అన్నారు. ఇదోక మూడు ముక్కుల ప్రభుత్వం, ఇతనొక మూడు ముక్కల ముఖ్యమంత్రి అని ఆయన విమర్శించారు. ఏదైనా మాట్లాడితే దత్తపుత్రుడిని అంటారు. ఇదుగో మూడు ముక్కల ముఖ్యమంత్రీ.. ఈ రణస్థలం నుంచి చెబుతున్నా.. మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్నాను. అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ సిఎంగా ఉన్నప్పుడు పంచెలూడిపోయేలా తరిమికొట్టండి అన్ని చెప్పాను.
ఆ తర్వాత మీ నాన్న మనుషులు నాపై దాడులు చేశారు, మహబూబ్‌నగర్‌లో నా సభ వేదికను కూల్చివేసి, నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఇలాంటివన్నీ ఎదుర్కొని వచ్చాను, మూడు ముక్కల ముఖ్యమంత్రి గుర్తించుకో అని సిఎం జగన్‌ను ఆయన హెచ్చరించారు. నేను భయపడను, ఏం చేస్తావు నువ్వేమైన దిగొచ్చావా? మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అంటావు, నేను విడాకులు తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నాను. మూడు ముక్కల ముఖ్యమంత్రి గుర్తించుకో అని పవన్ కళ్యాణ్ అన్నారు. అఠీన్ రాజాలు, డైమండ్ రాణులు, ఢంకాపలాసు సలహాదారు లాంటి సన్నాసులు, చేతగాని మూడు ముక్కల ప్రభుత్వం ప్రతినిధులు నన్ను మాటలంటారా? అని ఆయన మండిపడ్డారు. నేను బతికున్నంత వరకు మీతో పోరాటం చేస్తాను. మీరు మాట్లాడే ప్రతి మాట నేను గుర్తించుకుంటాను, మా జనసైనికులు గుర్తించుకుంటారని అన్నారు.
ఏదైనా మాట్లాడితే కాపులను నమ్మకూడదు అంటారు. నేను కులనాయకుడిని కాదురా సన్నాసుల్లారా.. నేనేమీ ఒక కులం కోసం రాలేదు. దేశం బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నారా సన్నాసుల్లారా అని పవన్ కళ్యాణ్ అన్నారు.