Monday, January 20, 2025

ప్రాణభయంతో ఎంఎల్‌ఎలు: పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపిలోని ఎంఎల్‌ఎలు ప్రాణహానితో భయపడే పరిస్థితులు వచ్చాయని, దీనికి ఆ రాష్ట్ర డిజిపి బాధ్యత తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. లేకపోతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని ఆయన హెచ్చరించారు. మాజీమంత్రి, ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందడం చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తుందని అన్నారు.

హుందా రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన రామనారాయణ రెడ్డి లాంటి వారు ఆందోళన చెందుతుంటే మిగిలిన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎంఎల్‌ఎ ఆనంకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం ప్రభుత్వం తగ్గించిందని, ఈ నేపథ్యంలో ఆయన ప్రాణ రక్షణ బాధ్యతను డిజిపి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News